Wednesday, December 23, 2009

తొలి పరిచయం









ఎవరైనా కొరుకునేది సంతోషంగా ఉండాలని, ఆ సంతోషాన్ని తనవాళ్ళతో పంచుకోవాలని.
ఒకవేళ తనకెవరి వల్లనైనా మేలు కలిగితే ఆమనిషిని నలుగురికీ పరిచయం చేయాలని. అంతేకదూ!


తన తల్లిని "మా అమ్మ" అని ప్రపంచంలో నాకు మత్రమే సొంతమైన ఓ అపురూపమైన మనిషని చెప్పాలని ఆశపడుతుంది ఓ పసిపాప.


తండ్రి గురించి గొప్పగా తెలియక పోయినా తన ప్రపంచలోని తొలి నాయకుడిగా, ధీరుడిగా, కొండంత ధైర్యంతో "మా నాన్న" అని చెప్తుంది మరో చిన్నారి.


ఆ చెప్పడంలో అతిశయం కంటె మరేదొ ఉంది కదూ! అదే ఓ భద్రతా భావం, తనదైన ఓ అనుభూతి, మరెంతో నిర్మలత, అన్నిటినీ మించి సంతోషాన్ని పంచుకోవాలనే ఆరాటం.


అమ్మ, నాన్న, అన్నయ్య, స్నేహితులు... ఇలా నా జీవితంలో తమదైన ముద్ర వేస్కుంటు వెళ్ళిన వళ్ళ అడుగుల జాడలు.


తొలి గురువు నాకు పరిచయం చేసిన ఓ గొప్ప వ్యక్తి "నాస్నేహితుడు". ఆమ్మ ఒడిలోని వెచ్చదనాన్ని, నాన్న ఇచ్చే రక్షణ కవచాన్ని, అన్న చూపే ఆదరణను, ఒక్క మాటలో చెప్పాలంటె "అనుక్ష్ణం నాతోడై దారి చూపి నడిపించే నేస్తం, నా సర్వం". ఇతన్నే మీకు పరిచయం చేయాలనుకుంటున్నా.


మీకు కూడా తను ఓ మంచి స్నేహితుడు, హితుడు కావాలని ఆశిస్తూ...

మళ్ళీ కలుద్దాం.

మీ నేస్తం