నీ ఊహలే అలలై
ఎగసే మనసును
నీ తలపులతో
వలపు ఊసులతో ఊయలూపి
తడియారని పెదవులతో
ఎరుపెక్కిన చెక్కిలిపై
నువు చేసే
చిలిపి సంతకాలు
గిలిగింతలై నా
తనువెల్లా శృతిచేస్తూ
తొలి పొద్దును
మలి సంధ్యను తెలుసుకోనీయక
మైకంలో నను
ముంచేయడం న్యాయమేనా నీకు?
జాణవే చెలీ
నెజాణవే నువ్వు
గులాబి బుగ్గలతో
కనుచివరల కొంటె
చూపు విసిరిందెవరో
నల్లని జడలో
మల్లెలు తురిమి
మనసుకు గాలమేసిందెవరో
తగిలీ తగలక
పైటకొంగుతో విసిరిందెవరో
చెప్పవే చిలకా
వయ్యారాలు ఆపై
సింగారాలు కలికీ
నీ తళుకుల బంధాలు
ఇంకా చాలక
నాపై అలకల
కోపాలు ఎంతటి జాణవే