దూరమౌతున్న నీ అడుగుల సవ్వడి కూడా
నాకు తెలియనివ్వకు ప్రియతమా
నీ శ్వాసలో చెరి నా ఉనికినే
మరచిన నా ఊపిరి నిలువలేదు మరి
నీ నడకలలో చేరి
తనవైపు అడుగులేయిస్తుందో
లేక నిను వీడలేని ఇష్టంతో
నన్నే వదిలి నీతో వస్తుందో
అందుకే
దూరమౌతున్న నీ అడుగుల సవ్వడి కూడా
నాకు తెలియనివ్వకు ప్రియతమా