రేపటి మాట వదిలెయ్ (చొడొ కల్ కి బాతియా - హిందీ చిత్రం)
నాకు నచ్చిన చిత్రం ఇది. ఎన్నిసార్లు చూసాలో గుర్తు లేదు కాని మనసులో నిలిచిన చిత్రం.
ఇప్పటి పరిస్థితిలో మన బ్రతుకులకు అద్దం పట్టి, మనలను నిలదీసే చిత్రం. బ్రతుకుతున్నామనుకుని బ్రతుకలేని మన చేతకానితన్నాన్ని, అందరితో కలిసి ఉన్నామనుకుంటూనే కలవలేని మన సంకుచిత మనసులను ఎత్తి చూపే చక్కని చిత్రం. ప్రతిక్షణాని ఎలా అనుభవిచాలో ఎలా బ్రతకాలో చెప్పే చక్కని సందేశం.
తక్కువలో తక్కువగా మంచి నటులను ఎన్నుకుని ఎక్కడా కూడా ఎక్కువ కాని విధంగా పాత్రలను మలుచుకొన్న విధానం నిజంగా మనసుకు హత్తుకుంది.
ఆదిత్య ప్రధాన్ నేటి సగటు మనిషికి ముఖ్యంగా మన సాఫ్ట్ వేర్ ఉద్యోలకు ప్రతీక. నిద్ర లేచిన దగ్గరనుండి టార్గెట్, గోల్ అంటూ పరుగులెత్తే మనిషి. ఇవ్వాళ రూపాయి సంపాదిస్తే, రేపు దానిని రెండు చేయాలనుకునే తపనతో తనతో తనే పోటీ పడే మనిషి.
ఇల్లు, కారు, అంతస్థు ఇలా అన్ని సమకూడినా దేనినీ తనది, తనకు అని గుర్తించి అనుభవించలేని వాడు. మంచి భార్య (సాక్షి), చక్కని కూతురు(తనీషా).
ఇక కథలోకి వస్తే:
తన ఆరంగ్రేటానికి తండ్రి వస్తే సంతోషించాలని, తన ప్రతిభను నాట్యాన్ని తండ్రి ముందు ప్రదర్శించాలని ఆరాట పడుతుంది. భర్తకు ఈ విషయాన్ని గుర్తు చేయాలని ప్రయత్నించి విఫల మవుతుంది సాక్షి. భ్ర్య కూతురిని గమనిచకుండానే ఫోన్ లో మాట్లాడుతూ వెళ్ళిపోతాడు ఆదిత్య. నిరుత్సాహంతో మిగిలిపోతారు వాళ్ళిద్దరూ.
ఆఫీలో కూడా క్షణం వౄధా కానివ్వకుండా తాను పని చేస్తూ చేయిస్తూ, తిండి తినే సమయాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు. ఈ క్రమలో 100 కోట్ల కాంట్రాక్ట్ తెచ్చుకుంటాడు. అన్నీ సరిగా జరిగి సంతోషలో భార్యకు ఫోన్ చేసి తన విజయాన్ని గర్వంగా చెప్పుకుంటాడు, కాని కూతురి ఆరంగ్రేటం గురించి ఆడగడు. ఈ విషయంలో సాక్షి చాలా బాధపడుతుంది. ఇల్లు విడిచి కూతురితో సహా వెళ్ళిపోతుంది.
మన ఆదిత్య గారేమొ ఫుల్ గా తాగేసి నిద్ర పోతారు. శని,ఆది వారాలు ఎలాగో గడిపేసి సోమవారం కోసం ఎదురుచూస్తాడు. కాని మళ్ళీ ఆదివారమే వస్తుంది. మళ్ళీ మళ్ళీ తన జీవితంలో ఆదివారం మాత్రమే వస్తుంది. ఎదురు చూసిన్ సోమవారం రానేరాదు.
ఈ క్రమంలోనే కనిపించే శుక్లాజి, పనిమనిషి, ధోభి ఇంకా మొదలైన వాళ్ళతో తన ప్రవర్తన పొగరుగా ఉంతుంది. ఎవరితోను కలవడు. (ఇక్కడ సన్నివేశాలు, భావ ప్రకటనా చాలా సహజంగా, చూపించారు). ఆదిత్య దాదాపు పిచ్చి వాడిగా మారి అలా కనిపించినా దారిలో నడుస్తూ ఓ ఫం హౌస్ చేరుకుంటాడు. ఇక్కడి నుండి కథ ఊహించని మలుపులతో చక్కని పాటలా సాగుతుంది. అంటా చెప్పేస్తే మంచి ఫీల్ మిస్సవుతారు. అందుకే చెప్పడం లేదు.
ఇక్కడినుండి ప్రతి దృశ్యం కళ్ళకు కట్టినట్లు మనతోనే మాట్లాడుతున్నట్లు ఉంటుందీ. ప్రతి సన్నివేశం, హావభావాలు సహజంగా, మనమే అక్కడ ఉన్నమా అన్నట్లుగా ఉన్నాయి. నాకైతే అనుపం ఖేర్ నటన చాలా నచ్చింది.
ఇక పాటల విషయానికొస్తే ప్రతి మాట అర్ధవంతంగా తనలో మనలను కలిపేసుకునే రాగాలతో అద్భుతంగా ఉన్నాయి. సంగీతం చాలా ఆహ్లాదకరంగా ఉంది.
ఎంత నిశ్శబ్ధంగా వచ్చిందో అంతే నిశ్శబ్ధంగా మనలను ప్రభావితం చేస్తుందీ, మన మనసులో కదలిక తెచ్చి చేతనావస్త లోకి తెస్తుందీ చిత్రం. బ్రతుకులోని తీయదనాన్ని అనుభూతింప చేస్తుంది అనడంలో ఆశ్చర్యమే లేదు.
తోడ తోడా హిందీ వచ్చీన నాకే నచ్చింది, ఇక హిందీ బాగా వచ్చిన వారికి ఇంకెంత నచ్చుతుందో కదా!