Monday, August 5, 2013

ఎప్పటికీ తిరిగి రానివి కొన్ని

ఎప్పటికీ తిరిగి రానివి కొన్ని
మరెప్పటికీ మరచిపోలేనివి ఇంకొన్ని

మొదటి స్నేహం, తొలి ప్రేమ
తొలిసారి ఒడిని చేరి
మురిపించిన చిన్నారి

మళ్ళీ తిరిగి రావు అలా అని
మరపుకూ రావు

నింగినుండి నేల జారిన చినుకు
తిరిగి ఎగరలేదు, కాని రూపం మార్చి
జీవంపోసే అమృతమే అవుతుంది

గుండెలోతుల్లో జనించి
మొలకెత్తినా ప్రేమ తన
గూడు చేరలేక పొవచ్చునేమో 

కాని తన రూపాన్ని మార్చుకుంటే
దాన్ని సరైన కోణంలో సంధించ గలిగితే
మరో అమృతపు చినుకవుతుందేమో