కన్నమ్మా!!
నీకిష్టమని, నీకు ఇవ్వాలని
ఇష్టంతో కొంచెం కష్టపడి
మా ఉసిరి చెట్టునడిగి
పట్టుకొచ్చాను నీకో తాయిలం
కాని ఇచ్చే దారి కనిపించడంలేదు
నీ దగ్గరకు రాలేని నేను
నా దగ్గరకు రాలేని
నీ పని వత్తిడి
ఇవేమో నా కళ్ళముందు
నా చేతుల్లో
పచ్చగా గమ్మత్తుగా
బంగారంలా మెరుస్తూ
నావంకే చూస్తూ
పిచ్చిదానా ఎందుకింత ఆత్రం అని
అమ్మలాగా మదలిస్తూ
అన్నయ్య కోసం దాచి ఉంచే తాయిలంలా
మనసు పొరల్లోని జ్ఞాపకాలన్నీ
కళ్ళముందు రింగులు చుట్టేస్తూ
ఒహ్హో.. చెప్పలేనన్ని
ఊసులతో నన్ను ముంచేస్తూ
అల్లరల్లరి చేస్తున్నాయి
ఈ ఉసిరికాయలు