Monday, June 30, 2014

నా నువ్వు నేనే కదా - నేను నువ్వే కదా!!

నా కోపంలోని ప్రేమను
ఆ ప్రేమలోని మధువును

నా నవ్వులో దాగిన బాధని
దాని వెనుకనున్న కారణాన్ని

నా మౌనం మాటున దాగిన మాటలను
ఆ మాటలలోని వాడిని

నా ప్రాణాత్మలలొ పల్లవింవిచే
సంవేదాన్ని సైతం అర్ధవంతగా


శృతిచేసి రోజుకో కొత్త రాగాన్ని
పలికించే నాదబ్రహ్మవా?

నాలో చలించే చైతన్య స్రవంతికి
సరికొత్త రూపానివా?

లేక నా ఉచ్వాశ నిశ్వాసాల ఝరిలో
ప్రవహించే ప్రాణానివా?

నా నువ్వు నేనే కదా
నేను నువ్వే కదా!!