గిలిగింతల పలకరింపులంటూ
మెల్లగా వీచే చలి గాలి
మోసుకొచ్చే ఊసులన్నీ
నాకోసమేనంది
నాలో ఊపిరి చిరునామా నువ్వని
నా ఊసులు బాసలూ నీతోనేనని
నా ప్రతి అణువు నీతో శృతికలిపిందని
నీ శ్వాశలోని పరిమళమే నా గిలిగింతకు కారణమని
తెలిపేదెలా చల్లగాలికి, వాన మబ్బులకు
దూరమైనా చేరువైన మనసుల నడుమ
తెలియకున్నా వలపుల ఊసులన్ని
మోసుకుంటూ చేస్తున్నాయి రాయబారాలు ఇలా
మెల్లగా వీచే చలి గాలి
మోసుకొచ్చే ఊసులన్నీ
నాకోసమేనంది
నాలో ఊపిరి చిరునామా నువ్వని
నా ఊసులు బాసలూ నీతోనేనని
నా ప్రతి అణువు నీతో శృతికలిపిందని
నీ శ్వాశలోని పరిమళమే నా గిలిగింతకు కారణమని
తెలిపేదెలా చల్లగాలికి, వాన మబ్బులకు
దూరమైనా చేరువైన మనసుల నడుమ
తెలియకున్నా వలపుల ఊసులన్ని
మోసుకుంటూ చేస్తున్నాయి రాయబారాలు ఇలా