Wednesday, March 11, 2015

ఎవరన్నారు మౌనం మాట్లాడదని

ఎవరన్నారు మౌనం మాట్లాడదని
వినే మనసుకు తెలిసిన భాష అదే కదా
మాటలు, పాటలు మరెన్నో శృంగార నైషదాలు
జనించిది ఈ భాషలోనే కాదా…
సరదాల గొడవలు, మరెన్నో యుద్ధాలు
అదుపులేని ఆవేశాలకనువైన భాష ఇదేకదా

ఒకటేమిటి, పెదవి దాటి రాని మాటలన్ని
మనసు లోతుల్లోని నిఘూడ భావాలన్ని
నీ వేలిచివర చేరి
మనః తనువును శృతిచేసే తీరులన్ని
నా మనుసుకే కదా తెలిసేది

కోపతాపాలూ, ప్రణయ భావాలూ
కనులు తెలిపే సరికొత్త సంగతులూ
చెప్పాలంటే
కేవలం రెండు హృదయలకే తెలిసిన
ఈ భాషకు మౌనాన్ని మించి
మరొక మంచి దారి లేదు