Wednesday, December 7, 2016

నిజమేనా జయమ్మా?

నమ్మశక్యం కాని జీవితం, ఆదరణ, విజయం, సమకాలీన కాలంలోని ఓ పరమాధ్బుతం "అమ్మ" జయలలిత.

వ్యకిగత కారణాలు ఏవైనా కానివ్వండి అనుకున్నది సాధించిన ధీర, ప్రతికూల పరిస్థితులలో పారిపోకుండా, గెలుపు రుచిచూసిన "పురుట్చి తలైవి". ఎక్కడో పుట్టి, మరెక్కడో మెరిసిన "విప్లవ నాయకి". ఇంతమంది జనం 'అమ్మా' అని ఏడుస్తున్నారంటే ఆమెలోని అమ్మ మనసే కారణం కదా! నాలుగురాళ్ళు వెనకేసుకోమని, పొయే సమయానికి నలుగురు మనుషులను సంపాదిచ్చుకోమని చెప్తారు పెద్దలు. ఆ నాలుగు కాస్తా నలుద్దిక్కులైనాయి తన విషయంలో.

తీయని గొంతు, అంతకంటే తీయనైన ప్రేమ, తనవారనుకుంటే తరగని ఆత్మీయత, దేహీ అన్న గొంతులకు జీవధార, నమ్మిన వారి కొంగుబంగారం, ఒకటనేమిటి చెప్పుకుంటూపోతే తరగని ఘని ఆమె గుణసంపద. కానివారికి మాత్రం పక్కలోబల్లెం.

ఎవడో ఎదో అన్నాడని, ఎదో జరిగిందని లోకం ముఖం చూడలేక, అయినవాళ్ళ ఆదరణ కరువైందని, అమ్మ తిట్టిందని, మరొకటి మరొకటి.........సవాలక్ష కారణలతొ జీవితాన్ని చాలించే ఈతరం అమ్మాయిలకు నిజమైన స్పూర్తి "అమ్మ".

పాషాణం లోపల దాగి, మృత్యువనే సెగకు కరిగిన వెన్నముద్దలా, ఇన్ని నయనాలలో జారింది అశృధారగా.... జయకేతనమెత్తిన లతమ్మ.

నువ్వెవరివైనా, నీకు నాకు పరిచయం లేకున్నా, విన్నదేదైన కానీ...ఎందుకో నువ్వంటే ఇష్టం అంటుంది నామనసు. అలాంటి నీవు ఇలా నిష్క్రమించడం మాత్రం నచ్చలేదు. మరణాన్నికూడా సునాయాసంగా స్వీకరిచగలితే ఎంతబాగుండేది కదా...తలొంచని నీపై రెణ్ణెల్లు పోరాడి గెలిచిదది. నాకనుమానం నువ్వే గెలవనిచ్చావేమో దాన్ని, లేక అంతరంతరాళలో ప్రేమించావేమో మరణాన్ని సైతం,  అందుకే తరలి వెళ్ళావేమో తోడుగా. పోనీ అదేం కాదులే అనుకుంటే  దేహీ అని పట్టిన దోసిలిలో భిక్షగా నీ ప్రాణాలనే వేసావా?
నిజమేనా జయమ్మా? 

Wednesday, November 30, 2016

మోడి అన్నా.. చిన్న విన్నపం

ఆన్నా, నువ్వు దేశభక్తుడివే, అందులో ఎలాంటి సందేహం లేదు. మంచే చేయాలనుకుంటావు, నమ్మకమే మాకు. కాకపొతే సిద్ధపాటు అదే ప్రిపరేషన్  సరిగా లేదన్నా. ప్లానింగ్ చేసినోడెవడొ గాని పళ్ళూడగొట్టాలన్న కోపం వస్తుంది.

పేదోళ్ళ గురించి ఆలోచిస్తావు, మంచిది. కాని కష్టపడే వాడిని కొట్టి, పనిలేని వెధవలకు పంచడం ఎంతవరకు సబబు.  ఆలోచించు. ఏ అమ్మ నాన్నైనా పిల్లలు పనిమంతులు కావాలనుకుంటారుగాని, సోమరిపోతులు కావాలనుకోరు. నువ్విప్పుడు దేశానికి పెద్దవు, నాన్నవు కదా!!! మరి నువ్వేంటి మాకష్టమంతా ఉచితాలు, సబ్సిడీలు అని వాళ్ళకు తగలేస్తావు. నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే పని ఇవ్వు, ఉచితాలు కాదు. సంపాదించే దారి చుపు, ఎవరో పెడ్తారనో లేక పక్కోడి కష్టం తినడం వాడి హక్కు అన్న భావన కాదు.

ఆత్మగౌరవం అంటే స్వయం కృషితో ఎదగడం, అడుక్కోవడం కాదు. అది తెలియచేయి.

సరే నీ దారిలోకే వద్దాం.

ఆన్నా!,

   బాంక్ లో దాచుకునేది రైతులు, ఉద్యొగస్తులు కూడా కదా? మరి వీళ్ళకు లోను ఇవ్వాలంటే సవా లక్ష రూల్స్, మరి బడాబాబులకేమొ నో రూల్స్. వీళ్ళు ఒక నెల వాయిదా కట్టలేకపోతే అపరాధ రుసుము అదీ ఇదీ కలిపి తలకు మోపెడు. సరే ఓ మూడు నెల్లు కట్టకపోతే, ఆస్తి జప్తు. మరి బడాబాబుల కెందుకు వెసులుబాటు? వాళ్ళూ ఎగ్గొట్టేవరకు కొండొకచో దేశం విడిచి పారిపోయే వరకు కళ్ళు తెరవరెందుకు. మాకూ వెసినట్లే వాళ్ళకు అపరాధ రుసుం, ఆస్తి జప్తు చేయరెందుకు. పైగా ఇవ్వలేదు కాబట్టి అదేదో రైట్ ఆఫ్ అంటా. ఇదేం న్యాయమన్నా.

కొంచెం దీని సంగతేందో చూడరాదా!!!!

ఒకసారి ఇళ్ళుకొన్నా, రెండు ఇళ్ళు కొన్నా కష్తార్జితమే కదా, అదియున్నూ లోను లోనే కదా! మరి వడ్డీ తేడాలెందుకు. మీకు జీతభత్యలకోసం, రోడ్డు రవాణా వగైరా వగైరా కోసం, మేము అంటే ఉద్యోగస్తులం (అందునా ప్రైవేటు ఉద్యోగస్తులం) కట్టే పన్నులే కదా. ఆదాయపన్ను మా జీతం ఇచ్చేటప్పుడే తెగ్గోస్తారు, చెతికొచ్చేదంతా తెల్ల డబ్బే కదన్నా.

ఐతే ఏంది గోల అంటావా?

ఆ తెల్ల డబ్బుతో ఉప్పు, పప్పు, సబ్బు గాడిదగుడ్డు కొంటే మళ్ళీ పన్ను ఎందుకు, మా పళ్ళూడకొట్టడానికి తప్ప. సగటున మా సంపాదన లో 50% పన్నులకేపొతే, మిగిలినదాంట్లొ గుట్టుగా సంసారం లాకొచ్చి ఎదో కొంపా గోడు కొనుక్కుంటే దానికి కూడా పన్నుపొటేస్తావే, ఏందన్నా ఈ అన్యాయం.

పేదోడంటావ్, ఫ్రీ అంటావ్. చదువు సంధ్య గాలికొదిలేసి బతుకంటే భాధ్యత లేనోడే మారాజు అనుకొనేలా చేశారు. నువ్వైనా మార్చకూడదా! వాడి వల్ల ఆదాయమేంటి, సమాజిక, ఆర్ధిక (ఎదో ఒకటి) రోడ్డు అభివృద్దికి ఒచ్చే లాభం ఎమైనా ఉందా? తెలీక అడుగుతున్నా, చెప్పు.

అరే అన్నిటికి కంట్రిబ్యూట్ చేసేవాడి నడ్డి విరగొట్టి, మా పైనోడికి (బడాబాబు కి), మా కిందోడికి (సో కాల్డ్ పేదోడికి) పెడుతున్నావు. ఏందన్నా?

ఆడెవుడి దగ్గరో నల్ల డబ్బుందని మా గూబ పగలగొట్టావు, సరేలే మనోడివే మంచిచేయలనుకున్నావు అనుకుని నోరుమూసుకుని సహకరిస్తే, నోటికి కూడు కూడా కరువయ్యేలా చేశావేంది.

అన్నిఉన్న అల్లుడి నోట్ళో శని అన్నట్లు, సొత్తున్నా సత్తువ లేకుండా చేశావే. త్యాగాలెప్పుడు మేమే చేయాలా అన్నా. కోట్లు పొయినా గతికేదానికి ఉండే పెద్దోల్లేమీ చేయబడలేదా?

అంబానికి, టాటా లకేమి తక్కువన్నా, అన్ని రాయితీలిస్తుండావు. ప్రతీ కొత్త కంపెనీ పెట్టినప్పుడెల్లా ఇదో రాయితీ అని బంగారు పళ్ళెంలో పెడ్తన్నావే, ఎందుకన్నా ఎగ్గొట్టేదానికా?

కొంచెం ఆలోచన చేయన్నా, మాలాంటి మధ్య తరగతోడు అదీ ఒంటిరెక్క కష్టం చేసి పైకొచ్చినోల్లకు కూసింత మిగలనియ్యి. రెక్కబట్టుకు లాక్కెళ్ళీ పేదోడు అదే నీ చుట్టాల పక్కన నిలబెట్టమాకు.

ఎదేనా తప్పూగా అనిపిస్తే క్షమించెయ్యన్నా. విషయం మాత్రం మదికి తీసుకో.

ఉంటానన్నా, మళ్ళీ పనికిబోవాల గందా! ఏంజేస్తం, రెక్కాడితే గాని డొక్కాడదాయే. ఆడక్కదినలేము, ఉద్దరకు తినలేము. మధ్యతరగతోల్లం, ఆత్మ - మల్లీ దానికో అభిమానం, మానం ఉన్నోల్లం మరి.  ఉంటానన్నా.

Wednesday, November 9, 2016

పెద్ద నోట్లు రద్దు - కానీ అంతకంటే పెద్ద నోటు సిద్దమైంది - పళ్ళూడగొట్టుకోడానికి



చిన్న నోట్లను, నాణేలను అందుబాటులో లేకుండా చేసి, పెద్ద వాటిని అలవాటుచేశారు. దాని వల్ల సగటు మనిషి ఖర్చు చేసే మొత్తం పెరిగింది. కాని అదే మొత్తంలో సంపాదన పెరగలేదు.
అప్పటివరకు బస్సుల్లోనే చిల్లర ఎగవేసేవాళ్ళూ, అదికూడా పర్వాలేదు అనుకునే స్థాయిలోలోనే సుమా. ఆ తర్వాత అది ఒక సంప్రదాయంలా, అదికారికంగా అన్నట్లు అన్నిచోట్లా అలాగే అయిపోయింది.

50 పైసలు, రూపాయి, రెండు రూపాయిల స్థానంలో 5 రూపాయిల బిళ్ళ వచ్చింది, ఇక నోటు అంటే 10, 50, 100, 500, 1000.

8 రూపాయల టికెట్ కి 10 నోటు ఇస్తే చిల్లర లేదు. 4 రూపాయల చిల్లర ఇవ్వవలసించోట గతిలేదు. ఇక ఊరు ప్రయాణాల్లోనయితే 100,500 కి కూడా చిల్లరుండదు. ఒకవేళ 50 రూపాయలు మనకివ్వవలిసి వస్తే టికెట్ పైన రాస్తాడు. డిపోలో తెచ్చుకో అని. అలా ఆ 50 హారతి కర్పూరం ఖర్చు మనకు.  అది కూడా మనకు ఇవ్వాల్సివస్తేనే. గుండు గీసి సున్నం పెట్టినట్లు....

సూపర్ మార్కెట్ లో మరీ దారుణం. 5, 10 రూపాయల చిల్లరకు ఓ మిటాయి బిళ్ళ ఇస్తారు. కక్కలేము అలాగని మింగలేము. మరి అదే తిరిగి మనం ఇస్తే చిల్లర కింద తీసుకోరు. ఎందుకంటారు....

ఎ.టి.ఎం లో 100 కంటే తక్కువ నోటు రాదు. చిల్లర కావాలంటే బలవంతంగా ఎదో ఒకటి కొనాలి. అది నష్టం కాదా.

ఇలా ప్రతిచోట దోపిడి, దోచుకోబడడం అలవాటు చేసి, ఇప్పుడు దిద్దుబాటు అంటున్నారు.

ఎదో ఒకటిలే, ఎదో మంచి జరుగుతుందంటున్నారు అనుకుంటే చిన్న నోట్లు కాదప్పా.... మరీ పెద్ద నోటు తెచ్చారు మనకోసం. ఇప్పుడు చిల్లర మరింత ప్రియం. బతుకు చినుగు మరింత పెరిగింది.

అన్నో నువ్వు మరి పెద్దోడి వయ్యావు, మంచిగా మరింత ఖర్చు పెత్తుకోడానికి.

కొంచమేనా ఆలోచించబడలేదప్పా? సందులో సందు మరింత చిన్న నోటు, చిల్లర పైసలు వాదుకలోకి తేవచ్చు కదా.

2000 నోటు (మరింత పెద్దది) తెచ్చేశారు. దానికేవో జాగ్ర్త్తలు తీశుకున్నాం అంటున్నారు. అంతేకాని, పేదోడికి ఎదన్నా మిగులుద్దం, వాడి సంపదన వాడినే తిననిద్దం అని మాత్రం కాదు.

ఇప్పటికే అది ఇది అని అన్ని ఉచితాలు చేసి అడుక్కోవడం అలవాటు చేశారు. ఇంకా చెప్పాలంటే సోమరితనం నరనరానా నింపేశారు.

ప్రజాసేవకుల జీతభత్యాలు మాత్రం ఎప్పటికప్పుడు పెర్ర్గుతాయి, పని చేయకున్న సరె. అవినీతి, అన్యాయం లీగలైజ్ చేసుక్కుని సాధారణ జీవితాలను మాత్రం అల్ల కల్లోలం చేశారు. వాళ్ళ ఖర్చులు మాత్రం తగ్గించుకోరు. మందీ మార్బలం, గానా భజానా. పార్టి మీటింగులకు పెట్టే ఖర్చు అంతే ఉండదు.

కాని మామూలు సగటు మనిషికి మేలు అంటూనే వెన్నెముక తీసి వాళ్ళాకు వజ్రాయుధాలు తయారు చేసుకుంటారు.

ఎదేమైన ఇదొక పరిణామం. రాబోయే సుధీర్ఘ పయనానికి ఓ మంచి ముందడుగు అని నమ్ముదాం. ఆలోచిస్తే నిజమనే అనిపిస్తుంది మోది మంచే చేస్తాడని. నమ్మేద్దాం మోడీ ని మనకోసం ఓ మంచి నాయకుడని.

దేశంలో ఏది ఏమూల జరిగినా అది మా బాబు చంద్రబాబు గారి ఆలోచనే మరి. ఇది కూడానూ.....
ప్రత్యేక హోదా తప్ప బాబుగారి ప్రతిమాటా మోదీ గారు వింటారు మరీ..............
ఇదే కొంచెం అనుమనంగా ఉంది. కొంచమేంటి చాలా అనుమానంగా ............

Note: I  heard many times from many people that "small currency helps in better living for common people and it controls the price/cost etc.". Hope Modi and team will consider this also.

Monday, October 24, 2016

నీ నవ్వుతో ఉప్పొంగెనొక గంగ నా మనసులో

 నీ నవ్వుతో ఉప్పొంగెనొక గంగ నా మనసులో
ఆ నవ్వు వెలిగేది క్షణమాత్రమైనా
ఆ ఉరక నిలిచేను నిలువెల్ల నాబ్రతుకులో

నీ పద సవ్వడితో జతకలిపి నా గుండె
జతిస్వరమై రవళించెనే మరి ఎందుకో
నీ అడుగుల సవ్వడిలేకనేమో త్వరపడి
నానుండి సెలవడి లీనమయ్యే అనంతాలలో