Friday, November 11, 2011

కార్తీక వస్తూనే

















కార్తీక వస్తూనే
తోడుతెచ్చుకుంది చలి చెలియను
మనమేం తక్కువా
అంటూ ప్రకృతి తోడు రమ్మంది
రంగురంగుల విరి బాలలను

తరుణి తలలో
పేరంటాల కొలువులో
మరి చెలికాని సన్నిధిలో
ఎక్కడ చూసినా
సొగసు కుసుమాల సవ్వడులే

తోడొచ్చిన చలి చెలియ
తయారమ్మా అంటూ పెత్తనం
చెలాయిస్తే తగదమ్మా
నీకంటూ చలిమంటలు జావాబిస్తుంటే
చెప్పలేనంత హాయిగా ఉందికదూ!!

చిన్ని పాపాయి
అమ్మ ఒడిలో పొత్తిళ్ళనే
కోరితే, పడుచు జంటలు
కౌగిలి కుంపటి జతచేరితే
మాకూ ఉందో దారంటూ
బామ్మ తాతలు
ముంగిట్లో వేసారు చలిపారదోలె
వెలుగు మంటలు

హా!!!!! ఎటూ చూసినా
మనకు సందడే సందడి
సంక్రాతి పూబంతులు
చేమంతులు, భోగిపళ్ళు
కొత్త బియ్యపు పాయసాలు
వచ్చేవరకు మీరేమంటారు మరి?

1 comment:

  1. మీరేమంటారో అదే అంటామండీ..ఆ పువ్వూ, ఆ పువ్వులాంటి కవిత రెండూ బాగున్నాయండీ. మీ పెరటిలో పూసిందా అది?

    ReplyDelete