Monday, November 14, 2011

నాలానే అచ్చంగా నాలనే




పూ సిన ఈ పున్నాగ పూలలో
కనిపించని నా మౌనరాగాలెన్నో
జతకలిసి ప్రతి పూవును ముడివేసి
జ్ఞాపకాల మాలలెన్నో కట్టేశాయి.

అమ్మ చేతిని పట్టుకుని
కొంగు చాటునుండి తొగి చూస్తున్న
నాలానే అచ్చంగా నాలనే
ఆకుల మాటునుండి తొగిచూస్తున్నాయి మొగ్గలన్నీ

చందమామను చూపిస్తూ
అమ్మ పెట్టే గోరు ముద్దలు
తింటూ నే లెక్కపెట్టిన చుక్కల్లానే
తికమక పెట్టేస్తున్నాయి విచుకున్న పువ్వులన్నీ

చిన్ని చేతులతో అన్నయ్య చొక్కా
పట్టుకుని నేనాడుకున్న రైలాటలానే
పువ్వు పువ్వు ఒకదానితోక మరొకటి పుచ్చుకుని
షికారుకు బయదేరాయి చిన్నారి చేతులలో

ఎంతగుచ్చినా తరగడం లేదు
ఈ పూలతో నా జ్ఞాపకాల మాలలు
తనివి తీరని సాయంత్రాలు
నిన్ను దాటి నే వెళ్ళినప్పుడల్లా వెక్కిరిస్తున్నాయి

2 comments:

  1. భావ వ్యక్తీకరణ చాలా చాలా బాగుంది!

    ReplyDelete
  2. "పువ్వు పువ్వు ఒకదానితోక మరొకటి పుచ్చుకుని
    షికారుకు బయదేరాయి" చాలా బావుంది.

    ReplyDelete