మావి చిగురు తినగానే కోయిల గొంతు పాడేనా?
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా?
ఎప్పటికి తేలని ప్రశ్న ఇది. అయినా ఎన్నెన్నో అనుభూతులకు అర్ధాలు, మధురోహలు తలపుకు తెచ్చే కమ్మని గీతం.
నిత్య నూతనంగా వచ్చే క్రొత్త సంవత్సరాదిని కళ్ళముందు నిలిపే కోయిల పాట, వెనువెంటనే దానిని వెతికడానికి ప్రుగులెత్తే కళ్ళకు నన్ను కుడా చుదమంటూ గమ్మతైన సువాసనలతో పలకరించే వేపపూలు, కొద్దిగా కళ్ళు మరల్చుదామనుకుంటే, పచ్చటి ఆకులలో ఉయ్యాలలూగే చిరు మామిళ్ళు.
ఓహ్, కళ్ళు తిప్పుకోనివ్వని కొత్త అందాలు కనువిందు చేస్తూ మనముదే నిలిచాయి కదా!!!!
ఇవ్వన్ని ఒక ప్రక్క. మరి రెండో ప్రక్క చుద్దామా. అరె! ముద్దబంతుల కాలం కాదు కదా మరి ఈ ఇవ్వన్నీ...అంటూ చేతి వ్రేళ్ళు చెక్కిళ్ళను చేరకముందే...
ఏయ్, సరిగా కళ్ళెట్టుకు చూడు. చిన్ని పాపలు, పట్టు పరికిణీల్లో, తూనిగల్లా పరుగెడుతూ....
నిజమే సుమా... అబ్బబ్బా ....
తెలుగుతనం తలలోని బొండుమల్లెల్లా లంగా వోణీలేసిన కన్నె పిల్లలు, మెడలోని హారాల్లా తళ్ళుక్కుమనే ఇంటి పడుచులు, ముఖమంతా మెరిసే పసుపు పూతలా అమ్మమ్మలు...
నాకు అర్ధం కాని విషయం ఒకటే .......ఇన్ని వర్ణాలను ఉగాది తెచ్చిందా, లేక వీళ్ళందరిని చూసి ఉగాది వచ్చిందా
ఓ బోసినవ్వుల చిన్ని పాపా చెప్పవా ఒకసారి.
ఉంగా ఉంగా అంటూ నువ్వు కూడా బుల్లి కోయిలమ్మలా కూస్తుంటే పరుగులెడుతూ ఉగాది వచ్చిందంటావా?
బంగారు తల్లీ, నీ ప్రతి నవ్వు ఓ ఉగాది నాకు. నిండు నూరేళ్ళు ఇలాగే నవ్వుతూ అనేకానేక ఉగాదులు తేవాలి నువ్వు.
ప్రతిలోగిలి ఆనందాల త్రుళ్ళింతలతో, సర్వ సౌఖ్యాలతో నిండే దీవెనల్తో మీ ఇంట ఉగాది అడుగుపెట్టాలని కోరుతూ...
No comments:
Post a Comment