పదేళ్ళ పసివయసులో ఆట పాట, అమ్మ నాన్నల ప్రేమ, కోపాలు, అల్లరి చేష్టలు, మురిపాలు ఫోగు చేసుకోవాలి. కాని ఎవడో చేసిన తప్పుకు పీడకలలే తోడుగా రాబోయే కాలంలోకి అడుగులేయడం ఎంత దుర్భరం. ఇదే అనుకుంటే ఇప్పుడో పసిపాపకు తల్లవడం, ఆ బంధాన్ని విడిపించుకున్నా దానితో ఎర్పడిన అనుభూతులు కుదురుగా బతక నిస్తాయా?
చిన్న చిన్న అనుభూతులే మనసుని అల్లకల్లోలం చేసే జ్ఞాపకాలు, మరి ఇంత పెద్ద బంధం అందులోనూ పేగు బంధాన్ని, ఎంత కాదనుకున్నా చెరిపేయగలగటం సాధ్యమేనా? అసలు అయ్యేపనేనా. ఇవ్వన్నీ ప్రక్కన పెట్టేస్తె, ఈ పది లఖలు ఎవరివ్వాలి? ప్రభుత్వమే..ఎందుకు? ఆ పాప భవిష్యత్తుకోసం. తప్పు చేసినోడిని ప్రభుత్వం నియమించిందా లేక పొషించిందా? సరె కనీస భాద్యత మరేదో అంటారు.. మరి ఆ తల్లి తండ్రుల సంగతేంటి? వాళ్ళ మనొక్షోభ.
కల్లముందే తల్లయిన చిన్నారి కుతురు, కళ్ళతోనే శులాలతో పొదిచేసే సమాజం. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ పుట్టుకొచ్చే కొత్త సమస్యలు.. వెరసి రాబోయే కాలమతా పేద్ద యుద్దం. అందరం చెప్పేమాట ఒకటే, మర్చిపోవాలి .. ముందుకు సాగిపోవాలి.. కాని ఆచరణలో సాధ్యమా?
ఆనుభవిస్తే తప్ప లోతుతెలియని బాధ ఇది. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిఓతాం, మరి ఈ కోలుకోలేని దెబ్బ మానేదెలా? కనిపించకుండా మనసుని మనిషిని రంపంలాకోసే పదుననిన రక్కసి కోరలు కదా ఈ జ్ఞాపకాలు. మెలకువలో వచ్చే పీడకలలు...
మొగుడు పెళ్ళాలు ఇద్దరు సంపాదిస్తే తప్ప గడవని కాలం. నిజమా? ఇద్దరి సంపాదనెందుకు, పిల్లలకు నొప్పి బాధ్యత తెలేకుండా పెంచడానికేగా? అమ్మ నాన్న నేను. అంతే ఇంకెవరు వద్దు. నాన్నమ్మ తాతయ్య, అత్త, బాబయి, పెదనాన్న.... ఆమ్మో అసలే వద్దు. పోనీ అమ్మమ్మ అటువైపువాళ్ళు .. పర్వాలేదు, కాని దగ్గరగా వద్దు. మరి పసి ప్రాణాలనెవరు చూసుకోవాలి, వాళ్ళకు మంచి చెడు, బాధ్యత బంధాలు ఎవరు నేర్పాలి?
మనుషుల బదులు స్మార్త్ ఫోనులు, టివిలు, సినిమాలు నేర్పితే ఇలాంటి చిన్నారితల్లులు, చేజారిన బ్రతుకులు, అల్లరయిన మన పరువు మాత్రమే మిగులుతాయి.
పెద్దలే కాదు బాధ్యతనేది ఎదుగుతున్న పిల్లలకు కూడా తెలియచేయాలి. ఎక్కువసమయం వాళ్ళతో గడిపే టీచర్లు, పెద్దలు కూదా పాటించి నేర్పించాలి మరి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా... కొత్త మోడల్ ఫోన్ వస్తే మనమే కొనాలి, కొత్త టివి మనకే కావాలి. కొత్త కొత్త గొప్ప గొప్ప అని పనికి పెంట్నంతా పొగేసిది పిల్లలకు చూపించేది మనమే. ఒక్కసారి మనను మనం పరిఖించి చూసుకొందాం. పనికొచ్చే పనులులెన్ని చేస్తున్నాం, పర్సనల్ స్పేస్, మనోల్లాసం పేరుతో పనికిరాని కర్చు, పనులు మమేం చేస్తున్నమో అని.
సొంతలాభం కొతమానుకుని, పిల్లల కోసం, మన పిల్లల కోసం, మనందరి కోసం ఏమేమి చేయొచ్చో ఒక్కసారి ఆలోచిద్దాం. ఆచరిద్దాం.
నియమ్మ అని నువ్వంటే నీ పిల్లలు అయమ్మకు అమ్మని కూడా అంటారు.
మార్పు ప్రతిఒక్కరిలో రావాలి అంటే ప్రతిఒక్కరు తనకు తానుగా మారాలి. అప్పుడే మంచి భవిష్యత్తు మన పిల్లకు ఉంటుంది.
ఏమో చూద్దాం కాదు ఇపుడే చేద్దాం, మారదాం అని సంకల్పించుకుంటే బాగుంటుందేమో కదా.
స్పష్టంగా ఇదీ అని తెలియని సందిగ్ధత, స్పష్టంగా కనిపిచని పరిష్కారం. ప్రయత్నిస్తున్నా అదేంటొ తెలుసుకోవాలని.
తెలుసుకున్నాకే చెప్పొచ్చుగా అంటున్నరా, ఇప్పుడు నేను చేసేదే పైన్ చెప్పినదతా, ఇంకా స్పష్తతకోసం ప్రయత్నిస్తున్నా..

No comments:
Post a Comment