నీలి నింగిలొ తెలియాడే
దూది మబ్బులన్నీ ఒక్కసారిగ
రంగుమార్చి నేల చేరితే
అదే కదా జాలువారే
చిరుజల్లుల సొగసరి నాట్యం
ఆ జల్లుకు మురిసిన ఆమని
సిగ్గుల పలకరింపే చిగురాకు
చెక్కిలిపై మెరిసిన సిగ్గులే
ఈ రంగు రంగుల పూవులన్ని
ఇదే కదా ప్రకృతి మేని పులకింత
ఆ విరిసిన పూలపై తేలియాడే
సీతకోక చిలుకల సరాగాలు
అవి చెసే తుంటరి విన్యాసాలు
అమ్మయ్యో! చాలవే రెండుకన్నులు
సప్తవర్ణాల సొగసు చూడగా
No comments:
Post a Comment