నాతో నేనే తోడుగా సాగే జీవిత గమనంలో,
నాలో నీకు కూడా చోటుందని గడుసుగా తోసుకు వచ్చావు
నేనెలా ఉన్నా నా ఆంతరంగమే నీకిష్టమని,
పదే పదే పలవరించి కనిపించే బొమ్మే చూడాలంటే
అర్ధం కాని అయోమయంలో నువ్వున్నావని నేనంటే,
తారాజువ్వలా ఎగిసిపడే నీ కోపం నీకైనా తెలిసిందా
ఇష్టమంటే నీకు నచ్చినది నేను చేయడం కాదురా బంగారూ,
నన్ను నన్నుగా నాఇష్టాన్ని కూడా ఒప్పుకునే మనసుండటం
నాకు చాయిస్ ఇచ్చానంటూనే నీ ఇష్టాలే అందులో పేరిస్తే,
ఆహమే తప్ప మరోటి కాదేమో ఆలొచించు అలక మాని
కలిసి వచ్చే నీడకుడా దారి మార్చి సాగుతుందే దినక్రమంలో,
కలిసి నడవాల్సిన మనం ఒకరికొకరం నీడ కావాలి కదా!
అద్భుతం.
ReplyDelete