మాట్లాడటమే సరిగా రాని నేను
ప్రతి క్షణం నీతో
మాట్లాడటానికే ఎదురుచూస్తున్నాను
ఎవరిని పట్టించుకోని నా కళ్ళు
నీ దర్శనం కోసం
ప్రతిక్షణం వెతుకుతున్నాయి
నువ్వు లేనప్పుడు నాది ఒంటరి ప్రపంచం
నువ్వు వచ్చాక నేను
మరిచాను అ ప్రపంచం
ఇంతకు ముందు నేను చేయలేను అనే భయం
నువ్వు వచ్చాక ఏదైనా
చేయగలను అన్న ధైర్యం
ఇంతకు ముందు నాకోసం నేను
నువ్వు వచ్చాక నీకోసం
చావునైనా ఎదిరించే తెగింపు
ఎమిటో మరి ఏమాయ చేసావో
నువ్వు ఇలా వచ్చి
నేను మళ్ళీ కొత్తగా పుట్టానేమొ అన్నంతగా.....
గమనిక: చెన్నుగా తానిచ్చిన ఓ చిన్న ఆలాపన
నా సొంతం కాదు.
No comments:
Post a Comment