నాదో చిన్న సందేహం. రాష్ట్రంలో ఎప్పుడు కూడా అధికారపక్షం, ప్రతిపక్షం ఉంటాయి కదా!
వాటి భాధ్యతలు వాటికి తెలుసు కదా! ప్రతిపక్ష హొదా ఇచ్చారంటే దానర్ధం అధికారపక్షపు లోపాలను ఎత్తిచూపి సరిచేయాలని. నిర్మాణాత్మక విషయాల్లో కలుగజేసుకునే అధికారం మీకు ఇచ్చారు. ప్రజలు మీకుకూడా ఒకవిధంగా అధికారమిచ్చినట్లె. ఇది నా చిన్ని బుర్రకు తెలిసిన విషయం.
మరి ప్రభుత్వం / అధికార పక్షం తీసుకునే నిర్ణయాలలో మీకు భాగం లేదా? అప్పుడు మీరేం చేస్తున్నట్లు? మీ పరిధిలో మీ పాత్రను నిర్వర్తించకుండా చోద్యం చూస్తున్నట్లా? చేయవలిసిన పనిని సరైన సమయంలో చేయకుండా వదిలేసి, మాకు అధికారమివ్వండి, మేము సరి చేస్తాము అనడం సరి కాదనుకుంటా. నిజంగా మన్స్సాక్షి ఉంటే ఇలా మాట్లాడరు. చావుబ్రతుకుల్లో ఉన్నవాడిని కాపాడే దారి చూడకుండా, చచ్చాక శవరాజకీయాలు చేసే రాక్షస ప్రవృత్తి అనుకుంటున్నాను. ఈ పాలన రాక్షస కావడంలో ప్రతిపక్షం వారి సహాయం, తోడ్పాటు ఉన్నాయని మాత్రమే చెప్తున్నాను.
అధికారం లేదనడం సరి కాదు, ఇచ్చీన అవకాశాన్ని ఉపయోగించకుండా, ఇంకేదో కావాలనడం మోసపూరిత, నిర్లక్ష్య ధోరణినే చూపిస్తుంది. మీ పాత్ర మీరు సరిగా నిర్వర్తిస్తే ప్రజలెప్పుడు ఆదరిస్తారు. దానికోసం ప్రత్యేకంగా ప్రాకులాడ పని లేదు.
గమనిక: నేనేమీ అధికారపక్షం తరపున వకల్తా తీసుకోలేదు, కాని జరుగుతున్న విషయాలను చూస్తుంటే కలిగిన అనుమానాలను వ్యక్తం చేస్తున్నాను. ఇది ఇరుపక్షాలకు వర్తిస్తుంది.
No comments:
Post a Comment