Tuesday, March 19, 2013

నన్ను నేను దాచేస్తున్నాను ఏమనుకోకు


నీతో ఉన్నప్పుడు తెలియలేదు
నువ్వెళ్ళిపోతున్నావు అన్న భయానికే�
సుడులు తిరుగుతున్నాయి కన్నీళ్ళు

ఒకవైపు నీ క్షేమం
మరో వైపు నీ ఎడబాటు
పంచుకోలేని భావల సడులెన్నో

గుండెకోత అంటే ఇదేనేమో
అనుభూతులన్నీ శిలాక్షరాలుగా
మారున్నవేళ ఆ ఉలి నొక్కులేమో

చేయివదిలి పోవద్దని
చెంతనే ఉండిపొమ్మని
అడగాలని ఆశగా ఉంది

కాని అది స్వార్ధమౌతుందేమో
అది చేప్పలేక నిన్ను వీడలేక
నన్ను నేను దాచేస్తున్నాను ఏమనుకోకు

1 comment: