
కలములతో వ్రాయగలనా
కవితలతో వర్ణించగలనా
కళలతో వివరించగలనా
నీ మహోన్నతమైన ప్రేమ
ఆరాధింతును ఆరాధింతును
ఆరాధింతును ఆరాధింతును
రారాజువు నీవే
నారాజువు నీవే
ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి
అంతరిక్షములు నీ చేతి పనిని వర్ణించుచున్నవి
దేవా నాప్రాణము నీకై తపియించుచున్నది
దేవా నాప్రాణము నీకై తపియించుచున్నది
ఆరాధింతును ఆరాధింతును
ఆరాధింతును ఆరాధింతును
రారాజువు నీవే
నారాజువు నీవే
సెరాపులు, కెరూబులు నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహాదూతలు, ప్రధానదూతలు నీ నామము కీర్తించుచున్నవి
దేవా నాప్రాణము నీకై తపియించుచున్నది
దేవా నాప్రాణము నీకై తపియించుచున్నది
ఆరాధింతును ఆరాధింతును
ఆరాధింతును ఆరాధింతును
రారాజువు నీవే
నారాజువు నీవే
కలములతో వ్రాయగలనా
కవితలతో వర్ణించగలనా
కళలతో వివరించగలనా
నీ మహోన్నతమైన ప్రేమ