Tuesday, August 7, 2012

నాలోని నేను నువ్వయ్యెంతగా

వేలవేల క్షణాలు
నా ఆలోచనలను
మధించాక తెలిసిన
కొత్త విషయం
ఎప్పనుండో నాలోనే
నిద్రిస్తున్న పాత విషయం

నేను ప్రేమిస్తున్నాను
అవును నేను ప్రేమిస్తున్నాను
ప్రేమను ప్రేమగా అందించే
నా నువ్వుని ప్రేమిస్తున్నాను
స్పష్టంగా మరెంతో స్వచ్చంగా
నిజంగానే నే ప్రేమిస్తున్నాను

ఎంతగా అంటే
నాలోని నేను నువ్వయ్యెంతగా
నేనులో కూడా నువ్వే కనిపించేంతగా
మనసు పొరల్లో
మౌన వాహినిలో
నా అస్థిత్వపు లోతుల్లో
ఎటు చూసినా
నువ్వే అన్నంతగా

Friday, July 13, 2012

(మన)సురాగాలు



నీ ఊహలే అలలై
ఎగసే మనసును

నీ తలపులతో
వలపు ఊసులతో ఊయలూపి
తడియారని పెదవులతో
ఎరుపెక్కిన చెక్కిలిపై

నువు చేసే
చిలిపి సంతకాలు

గిలిగింతలై నా
తనువెల్లా శృతిచేస్తూ

తొలి పొద్దును
మలి సంధ్యను తెలుసుకోనీయక

మైకంలో నను
ముంచేయడం న్యాయమేనా నీకు?

జాణవే చెలీ
నెజాణవే నువ్వు

గులాబి బుగ్గలతో
కనుచివరల కొంటె
చూపు విసిరిందెవరో

నల్లని జడలో
మల్లెలు తురిమి
మనసుకు గాలమేసిందెవరో

తగిలీ తగలక
పైటకొంగుతో విసిరిందెవరో
చెప్పవే చిలకా

వయ్యారాలు ఆపై
సింగారాలు కలికీ
నీ తళుకుల బంధాలు

ఇంకా చాలక
నాపై అలకల
కోపాలు ఎంతటి జాణవే

Friday, March 30, 2012

వర్డుప్రెస్సు సహాయం కావాలి

ఎవరైన షేర్ దిస్ ప్లగ్గిన్ వాడారా?నేను వర్డ్ ప్రెస్ 3.2.1 వాడుతున్నాను. దాంట్లో ఫేస్ బుక్ బుటన్ సరిగా పనిచేయడం లేదు. కేవలం ఒక షార్ట్ లింక్ మాత్రమే ఇస్తుంది. అదిసరిగా పనిచేయడానికి ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలొ చెప్పగలరా!

Monday, February 6, 2012

నమ్మలేక వెక్కుతోంది ఎందుకురా ఇలా














పసి పాపవే నీవనుకున్నా
నా ఎదపై నిదురించే అ చిన్ని పాపవే నీవనుకున్నా

నీ నవ్వులలోనే నా బ్రతుకు తెలవారుతుందని
మెరిసే నీ కన్నులలోని వెలుగు తానుకావాలని

ఎంత పిచ్చిగా నిదురపోయాను
దూరమైన నీ అడుగులు గుర్తించలేనంతగా

పిచ్చి నమ్మకంతో వత్తిలా కరిగిపోతూ
ఇంక అమ్మననే అనుకుంటోంది పిచ్చి తల్లి

తానే బొమ్మలా మారింది నువ్వాడుకుంటావని
పాతపడిన బొమ్మని విసిరేస్తావని ఇపుడేగా తెలిసింది

నీకుతెలియని గత వర్తమానాలే లేవు నాకు
కాని నాకు తెలియనిది నీ వర్తమాన భవిష్యత్తులే

తప్పటడుగులు వేస్తే చేయందించింది తానే
దారి తప్పిన నీ ఆడుగులకు అడ్డుపడి జారిపోతుంది తనే

నాన్నలూ అంటూ పొత్తిళ్ళలో దాచుకుంది
వొడిలో నుండి జారిపోతున్నా నిన్నాపలేకపోతోందీ తనే

అదను చూశి పదునుగా పొడిచావే దయగా
చావలేక బ్రతకలేక కొట్టుకులాడమంటూ చివరిగా

ఎందుకిలా చేశావని ఆడగాలనుంది
వేయినోళ్ళతో అది తన నమ్మకాన్ని వెక్కిరిస్తోంది

ఈ బంధాన్ని తెంచుకుని నువ్వెగిరిపోతావని
తెలిసి కుడా పిచ్చిగా అతుకులేయాలని అత్రపడుతుంది

పిచ్చి అమ్మ, పాతబడిన బొమ్మ తానని
తెలుసుకోలేక తెలిసినా నమ్మలేక వెక్కుతోంది ఎందుకురా ఇలా