Saturday, May 21, 2011

నే పాడుకొన్న స్వప్న గీతాలు

ఆశలతొ నే నల్లుకొన్న
పొదరింట్లో మీ అడుగులో అడుగువేసి
సిగ్గుతో వంచిన మోములో
చిరునవ్వులె వెతకాలని


తోరణాల అంచులు పట్టి
తొంగి చూసే పూబంతులు, ఆ వెనుక చేరిన
ఇంతులు అది చాలదని చిరు గోటితొ
అరచేతిలో మీరు పలికించే సరాగాలు


అసలేమి ఎరగనట్లు దరహాసంతో
వడి వడి అడుగులు నువ్వేస్తే
ఎరుపెక్కిన చెక్కిలితో బరువైన
అడుగులతో తడబడుతూ నేను


అది చాలక ప్రౌఢల చతురోక్తులు
ఆపై అల్లరి నిండిన మేచుపులూ
బాణాలు, ఇన్నిటి నడుమ బెదిరిన
కన్నులతో మీవెంట నేను


అలసిపొయావా అంటూ మేలమాడే
ఆడపడుచులు, ఇంత సుకుమారమా అంటూ
చెక్కిలి నొక్కే అత్తలు అమ్మో
ఇందరి నడుమ నేనొక్కదాన్నే!!!


నేనున్నానంటు చేతిని నొక్కి
అది మరో కంటిని చేరకముందే
చెవిప్రక్క గుస గుసలాడే చతురు
ఎంతటి నేర్పరులో సుమా తమరు!


ఇవన్నీ కలల తీరంలొ నే
వ్రాసుకున్న కథలు
కనురెప్పల మాటున
నే పాడుకొన్న స్వప్న గీతాలు