Monday, June 27, 2011

ఒకరికొకరం నీడ కావాలి కదా!








నాతో నేనే తోడుగా సాగే జీవిత గమనంలో,
నాలో నీకు కూడా చోటుందని గడుసుగా తోసుకు వచ్చావు

నేనెలా ఉన్నా నా ఆంతరంగమే నీకిష్టమని,
పదే పదే పలవరించి కనిపించే బొమ్మే చూడాలంటే

అర్ధం కాని అయోమయంలో నువ్వున్నావని నేనంటే,
తారాజువ్వలా ఎగిసిపడే నీ కోపం నీకైనా తెలిసిందా

ఇష్టమంటే నీకు నచ్చినది నేను చేయడం కాదురా బంగారూ,
నన్ను నన్నుగా నాఇష్టాన్ని కూడా ఒప్పుకునే మనసుండటం

నాకు చాయిస్ ఇచ్చానంటూనే నీ ఇష్టాలే అందులో పేరిస్తే,
ఆహమే తప్ప మరోటి కాదేమో ఆలొచించు అలక మాని

కలిసి వచ్చే నీడకుడా దారి మార్చి సాగుతుందే దినక్రమంలో,
కలిసి నడవాల్సిన మనం ఒకరికొకరం నీడ కావాలి కదా!

Tuesday, June 21, 2011

ఎమిటో మరి ఏమాయ చేసావో














మాట్లాడటమే సరిగా రాని నేను
ప్రతి క్షణం నీతో
మాట్లాడటానికే ఎదురుచూస్తున్నాను

ఎవరిని పట్టించుకోని నా కళ్ళు
నీ దర్శనం కోసం
ప్రతిక్షణం వెతుకుతున్నాయి

నువ్వు లేనప్పుడు నాది ఒంటరి ప్రపంచం
నువ్వు వచ్చాక నేను
మరిచాను అ ప్రపంచం

ఇంతకు ముందు నేను చేయలేను అనే భయం
నువ్వు వచ్చాక ఏదైనా
చేయగలను అన్న ధైర్యం

ఇంతకు ముందు నాకోసం నేను
నువ్వు వచ్చాక నీకోసం
చావునైనా ఎదిరించే తెగింపు

ఎమిటో మరి ఏమాయ చేసావో
నువ్వు ఇలా వచ్చి
నేను మళ్ళీ కొత్తగా పుట్టానేమొ అన్నంతగా.....


గమనిక: చెన్నుగా తానిచ్చిన ఓ చిన్న ఆలాపన
నా సొంతం కాదు.

Monday, June 20, 2011

నీతో ఎంగేజ్ అయ్యాకా





















నీతో ఎంగేజ్ అయ్యాకా
మొబైల్ రింగు అంటే ఇష్టం
గంటలసేపు మాట్లాడేందుకు
ఏముంటాయని అన్నానపుడు
గంటలు కుడా నిమిషాల్లాగా ఉన్నాయిపుడు


నీతో ఎంగేజ్ అయ్యాకా
నిద్రల్లేని రాత్రులు
చుక్కలతోనే ముగ్గులు
గాలితోనే ఊసులు
నిలకడలేని చూపులు
పెదవులపైన నవ్వులు
కళ్ళలోని మెరుపులు


నీతో ఎంగేజ్ అయ్యాకా
ఈమెయిలంటే మక్కువగా
పెరిగే మొబైల్
బిల్లే తక్కువగా
నీతో మట్లాడే
క్షణాలే మురిపెంగా
ఎంతో వింతగ
ఉందీ సిట్యుయేషన్

నీతో ఎంగేజ్ అయ్యాకా
ముందెన్నడు తెలియని
నువ్వు మరెంతో
దగ్గర అనిపిస్తుంటే
వింతే అయినా
ఎంతో కొత్తగా
ఉందేంటిపుడూ

Tuesday, June 14, 2011

ఓ తీయని జ్ఞాపకంలా




















చల్లగాలి నల్ల మబ్బులు
తొలకరి చినుకులు మల్లె పూలు
గమ్మత్తుగా మత్తెక్కిస్తుంటె
రోజంతా నీకోసం నేనెదురు చూస్తుంటే
ఏదో తెలియని మైకం నను
కమ్మెసి నీ వైపు లాగేస్తుంది
ఎందుకంటావ్? నువ్వేం చెపుతావులె
మాయచెయడమే తెలిసిన
రాజకుమరుడివి పైగా సీమంతరాలలో ఉన్నవాడివి

అందుకే ...

అడిగానని చెప్పు
నీ తలపులలోని
వలపు కన్నియను
పిలిచానని చెప్పు
నీ ఎదలో మెరిసే
వయ్యారి తలపులను
పెదవిపై చేరి
చిరునవ్వుల పూవులే పూయాలని
ఎదురు చూస్తున్నానని
చెప్పు విరిసిన ఆ
నవ్వుల పువ్వుల కోసం
నావైపు నడచివచ్చే
నీ అడుగుల కోసం


ప్రియా
ఉండనా మరి
నీ మదిలొ కదిలె
ఓ తీయని జ్ఞాపకంలా

Friday, June 3, 2011

సప్తవర్ణాల సొగసు చూడగా
















నీలి నింగిలొ తెలియాడే
దూది మబ్బులన్నీ ఒక్కసారిగ
రంగుమార్చి నేల చేరితే
అదే కదా జాలువారే
చిరుజల్లుల సొగసరి నాట్యం

















ఆ జల్లుకు మురిసిన ఆమని
సిగ్గుల పలకరింపే చిగురాకు
చెక్కిలిపై మెరిసిన సిగ్గులే
ఈ రంగు రంగుల పూవులన్ని
ఇదే కదా ప్రకృతి మేని పులకింత
















ఆ విరిసిన పూలపై తేలియాడే
సీతకోక చిలుకల సరాగాలు
అవి చెసే తుంటరి విన్యాసాలు
అమ్మయ్యో! చాలవే రెండుకన్నులు
సప్తవర్ణాల సొగసు చూడగా