Friday, September 5, 2014

ఆలోచించండి. అడుగువేయండి.

ప్రజలందరూ రాజధాని నిర్మాణానికి నిధులివ్వాలి. రైతులందరూ (రాజధాని నిర్మించే ప్రాతంలోనివారు) స్వచ్చందంగా భూములు ఇవ్వాలి.

పేదరిక నిర్మూలన, ప్రజా సేవ మాలక్యం, ధ్యేయం, సింగినాదం, జీలకర్ర.

ఇది మన నేతల ప్రగల్బాలు. రాష్ట్రం విడిపోయి, పీకల్లోతు ఆర్థిక  ఇబ్బందుల్లో మునిగి ఉన్నాం.

అంతే కాదు అన్న దాతను ఆ పథకం ఈ పథకం, ౠణమాఫీ అంటూ నానా రకాల వాగ్ధానాలు, పథకాలు చెప్పి నడుం విరగొట్టారు. కేవలం అడుక్కు తినేవారిలాగా మార్చారు. ప్రజలను సొమరుల్లా ప్రజలను మార్చి స్వయం కృషి, కష్ట పడే తత్వాన్ని చంపేశారు. 

ఇక ఆసెంబ్లి సమావేశాల్లో వ్యక్తిగత దూషాణలే తప్ప, ణిర్మాణాత్మక నిర్ణయాలకు కేటాయించిన సమయం ఎంత?
ఫైవ్ స్టార్ హొటల్లోనే సమవేశలు, ఎం మామూలు భవనాల్లొ, ఆడితోరియంలలో కుదరదా? ఇదేనా పొదుపు. పొదుపు కేవలం, త్యాగం కేవలం సామనులకేనా, మత్రులకు అక్కరలేదా? ఇవేనా నాయకత్వ లక్షణాలు?  

ఇదేనా సేవా నిరతి?

ఐపాడ్ లు లెకపొతే పని చేయలెరా? ప్రభుత్వం ఐపాద్లు ఇవ్వకపోతే వాళ్ళు కొన్నుక్కోలేరా?
ఇలా ప్రజాధన్నాన్ని వాదుకోవడాం తప్ప మరో ఆలోచన రాదా వీళ్ళకు?

ఎన్నికైన మత్రులందరూ పేదవాళ్ళా? 

కాదే అరగనంత డబ్బున్న వాళ్ళే కదా! జీతలేమన్నా తక్కువ వస్తాయా? ఈ జీతాల్లేకపొతే పూటగడవదా?

యనమల రామకృష్ణుడు గారు ఇంతద్దె కట్టలేనంత పేదవాడా? మంత్రి కాకముందు అదే ఇంట్లో ఉన్నారు కదా! అప్పుడు అద్దె ఎవరు కట్టారు?
మంత్రి అయ్యాక అదే ఇంటికి ప్రభుత్వం నెలకు అక్షరాలా 50,000 ల రూపాయల ప్రజా ధనాన్ని చెల్లిస్తోంది.  

ప్రజలారా ఆలోచించండి మన నేతలు కేవలం వాళ్ళ అవసరాలే తప్ప, మన గురించి పట్టించుకునే రకాలు కాదు.
కనీసం మన స్వయం ప్రతిపత్తి మనమే పెంచుకోవాలి. వీళ్ళపై ఆధారపడకుండా ఉండటం నేర్చుకోవాలి.  
మన బ్రతుకు మన నిర్ణయాలతోనే నిలవాలి. పథకాలు, వాగ్ధానాలపై నమ్మకం కంటే, మన ప్రతిభ స్వయం శక్తినే నమ్మాలి.  

మన బ్రతుకు మనమే నిర్ధేశించుకోవాలి.

ఆలోచించండి. అడుగువేయండి.  నేర్చుకోండి. నిలదీయండి. స్వయంగా సొంతంగా మీ శక్తితో  బ్రతకండి.

 

No comments:

Post a Comment