Wednesday, November 30, 2016

మోడి అన్నా.. చిన్న విన్నపం

ఆన్నా, నువ్వు దేశభక్తుడివే, అందులో ఎలాంటి సందేహం లేదు. మంచే చేయాలనుకుంటావు, నమ్మకమే మాకు. కాకపొతే సిద్ధపాటు అదే ప్రిపరేషన్  సరిగా లేదన్నా. ప్లానింగ్ చేసినోడెవడొ గాని పళ్ళూడగొట్టాలన్న కోపం వస్తుంది.

పేదోళ్ళ గురించి ఆలోచిస్తావు, మంచిది. కాని కష్టపడే వాడిని కొట్టి, పనిలేని వెధవలకు పంచడం ఎంతవరకు సబబు.  ఆలోచించు. ఏ అమ్మ నాన్నైనా పిల్లలు పనిమంతులు కావాలనుకుంటారుగాని, సోమరిపోతులు కావాలనుకోరు. నువ్విప్పుడు దేశానికి పెద్దవు, నాన్నవు కదా!!! మరి నువ్వేంటి మాకష్టమంతా ఉచితాలు, సబ్సిడీలు అని వాళ్ళకు తగలేస్తావు. నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే పని ఇవ్వు, ఉచితాలు కాదు. సంపాదించే దారి చుపు, ఎవరో పెడ్తారనో లేక పక్కోడి కష్టం తినడం వాడి హక్కు అన్న భావన కాదు.

ఆత్మగౌరవం అంటే స్వయం కృషితో ఎదగడం, అడుక్కోవడం కాదు. అది తెలియచేయి.

సరే నీ దారిలోకే వద్దాం.

ఆన్నా!,

   బాంక్ లో దాచుకునేది రైతులు, ఉద్యొగస్తులు కూడా కదా? మరి వీళ్ళకు లోను ఇవ్వాలంటే సవా లక్ష రూల్స్, మరి బడాబాబులకేమొ నో రూల్స్. వీళ్ళు ఒక నెల వాయిదా కట్టలేకపోతే అపరాధ రుసుము అదీ ఇదీ కలిపి తలకు మోపెడు. సరే ఓ మూడు నెల్లు కట్టకపోతే, ఆస్తి జప్తు. మరి బడాబాబుల కెందుకు వెసులుబాటు? వాళ్ళూ ఎగ్గొట్టేవరకు కొండొకచో దేశం విడిచి పారిపోయే వరకు కళ్ళు తెరవరెందుకు. మాకూ వెసినట్లే వాళ్ళకు అపరాధ రుసుం, ఆస్తి జప్తు చేయరెందుకు. పైగా ఇవ్వలేదు కాబట్టి అదేదో రైట్ ఆఫ్ అంటా. ఇదేం న్యాయమన్నా.

కొంచెం దీని సంగతేందో చూడరాదా!!!!

ఒకసారి ఇళ్ళుకొన్నా, రెండు ఇళ్ళు కొన్నా కష్తార్జితమే కదా, అదియున్నూ లోను లోనే కదా! మరి వడ్డీ తేడాలెందుకు. మీకు జీతభత్యలకోసం, రోడ్డు రవాణా వగైరా వగైరా కోసం, మేము అంటే ఉద్యోగస్తులం (అందునా ప్రైవేటు ఉద్యోగస్తులం) కట్టే పన్నులే కదా. ఆదాయపన్ను మా జీతం ఇచ్చేటప్పుడే తెగ్గోస్తారు, చెతికొచ్చేదంతా తెల్ల డబ్బే కదన్నా.

ఐతే ఏంది గోల అంటావా?

ఆ తెల్ల డబ్బుతో ఉప్పు, పప్పు, సబ్బు గాడిదగుడ్డు కొంటే మళ్ళీ పన్ను ఎందుకు, మా పళ్ళూడకొట్టడానికి తప్ప. సగటున మా సంపాదన లో 50% పన్నులకేపొతే, మిగిలినదాంట్లొ గుట్టుగా సంసారం లాకొచ్చి ఎదో కొంపా గోడు కొనుక్కుంటే దానికి కూడా పన్నుపొటేస్తావే, ఏందన్నా ఈ అన్యాయం.

పేదోడంటావ్, ఫ్రీ అంటావ్. చదువు సంధ్య గాలికొదిలేసి బతుకంటే భాధ్యత లేనోడే మారాజు అనుకొనేలా చేశారు. నువ్వైనా మార్చకూడదా! వాడి వల్ల ఆదాయమేంటి, సమాజిక, ఆర్ధిక (ఎదో ఒకటి) రోడ్డు అభివృద్దికి ఒచ్చే లాభం ఎమైనా ఉందా? తెలీక అడుగుతున్నా, చెప్పు.

అరే అన్నిటికి కంట్రిబ్యూట్ చేసేవాడి నడ్డి విరగొట్టి, మా పైనోడికి (బడాబాబు కి), మా కిందోడికి (సో కాల్డ్ పేదోడికి) పెడుతున్నావు. ఏందన్నా?

ఆడెవుడి దగ్గరో నల్ల డబ్బుందని మా గూబ పగలగొట్టావు, సరేలే మనోడివే మంచిచేయలనుకున్నావు అనుకుని నోరుమూసుకుని సహకరిస్తే, నోటికి కూడు కూడా కరువయ్యేలా చేశావేంది.

అన్నిఉన్న అల్లుడి నోట్ళో శని అన్నట్లు, సొత్తున్నా సత్తువ లేకుండా చేశావే. త్యాగాలెప్పుడు మేమే చేయాలా అన్నా. కోట్లు పొయినా గతికేదానికి ఉండే పెద్దోల్లేమీ చేయబడలేదా?

అంబానికి, టాటా లకేమి తక్కువన్నా, అన్ని రాయితీలిస్తుండావు. ప్రతీ కొత్త కంపెనీ పెట్టినప్పుడెల్లా ఇదో రాయితీ అని బంగారు పళ్ళెంలో పెడ్తన్నావే, ఎందుకన్నా ఎగ్గొట్టేదానికా?

కొంచెం ఆలోచన చేయన్నా, మాలాంటి మధ్య తరగతోడు అదీ ఒంటిరెక్క కష్టం చేసి పైకొచ్చినోల్లకు కూసింత మిగలనియ్యి. రెక్కబట్టుకు లాక్కెళ్ళీ పేదోడు అదే నీ చుట్టాల పక్కన నిలబెట్టమాకు.

ఎదేనా తప్పూగా అనిపిస్తే క్షమించెయ్యన్నా. విషయం మాత్రం మదికి తీసుకో.

ఉంటానన్నా, మళ్ళీ పనికిబోవాల గందా! ఏంజేస్తం, రెక్కాడితే గాని డొక్కాడదాయే. ఆడక్కదినలేము, ఉద్దరకు తినలేము. మధ్యతరగతోల్లం, ఆత్మ - మల్లీ దానికో అభిమానం, మానం ఉన్నోల్లం మరి.  ఉంటానన్నా.

No comments:

Post a Comment