Monday, November 21, 2011

ఎంత సిగ్గో మరి!

చిగురాకుల మధ్య లో
పుట్టిందో చిన్ని మొగ్గ
బిక్కు బిక్కు మంటూ,
నెమ్మదిగా తొంగి చూస్తూ
ఆకుల మధ్యలో దాగుడుమూతలాడుతూ
రంగులద్దిన పూరేకులు తనలోనే
దాచుకొంటూ కొత్తగా తన
రూపాన్ని సరి చేసుకుంటూ
నే-నెప్పుడు చుసినా ముఖాన్ని
ఆకుపచ్చ రేకల మధ్య
దాచుకునే ఉంటుందీ సుందరి
ఎంత సిగ్గో మరి!

సూరీడు చెప్పే ఊసులన్నిటికి
తల ఊపుతూ, చలి నొక్కిన
చెక్కిలిని సరి చేసుకుంటూ
మా ఇంటి ముంగిట్లో, తొలి వెలుగులో
నాకు చెప్పకుండానే ఫక్కుమన్న
తన నవ్వుల రంగులన్నీ
పరిచేసింది నేను నిదురైనా లేవకముందే
అంతేలే నే పలకరిస్తే తలైనా ఊపదు
రేరాజు చెప్పే కబురులకైతే
విచ్చుకున్న రంగుల పూరెక్కలతో
ప్రతి సమాధానమిస్తుంది
ఎంతటి నెరజాణో కదా ఈ పూబాల

2 comments:

  1. సిగ్గరి పూవ్వుపై మీ కవిత్వం బావుందండీ...

    ReplyDelete
  2. నేర జాణ ఈ పూబాల
    సిగ్గు సిగ్గు సింగారి
    వయ్యారి కూడా ను !

    ReplyDelete