Thursday, December 1, 2011

ఒక్క క్షణం

ఒక్క క్షణం
పుట్టుకకు చావుకు
మధ్య ఉన్న తేడా

ఆ ఒక్క క్షణమే
బ్రతకడానికీ చావడనికి
మధ్య సరిహద్దు గోడ

ఆ ఒక్క క్షణమే
ఆశల అంచులనుండి
మనిషి పడద్రోసేది

ఆ ఒక్క క్షణమే
వెలుగును చీకటి చేసి
బ్రతుకును అంధకారం చేసేది

ఆ ఒక్క క్షణమే
ఆలోచనల వత్తిని
వెలిగించి నడిపించేది

ఆ ఒక్క క్షణాన్నే
నా చేతిలో పెట్టుకోగలిగితే
నా జీవిత మాధుర్యం అనంతం.

2 comments:

  1. బాగుంది, ఒక్క క్షణం లో ఎన్ని మార్పులో జీవితంలో...

    ReplyDelete
  2. ఆ క్షణమే మహా గడుసుది..అందకుండా ఆటాడిస్తుంది..

    ReplyDelete